తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన వాటిలో దాదాపు ఒకటి , రెండు మినహాయిస్తే అన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన దర్శకుడుగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు ఆఖరుగా నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టోరీ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శేఖర్ కొంత కాలం క్రితం ధనుష్ , నాగార్జున ప్రధాన పాత్రలలో రష్మిక మందన హీరోయిన్ గా కుబేర అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రస్తుతం ఒక భారీ సెట్ ను వేస్తున్నట్లు ఈ సెట్ వర్క్ మరో కొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నట్లు ఆ తర్వాత ఈ సెట్ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

నాగార్జున , ధనుష్ కీలక పాత్రలో నటిస్తూ ఉండడం , శేఖర్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో కుబేర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా అవి కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk