సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే ఇలా చిత్ర పరిశ్రమంలోకి వచ్చిన హీరోయిన్లు కొంతమంది తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ వరుసగా సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంటారు. ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం ఒకటి, రెండు సినిమాలకు మాత్రమే పరిమితమై ఇండస్ట్రీలో కనుమరుగవ్వడం చూస్తూ ఉంటాం.


 అయితే ఇలా అవకాశాలు లేకో ఇండస్ట్రీకి దూరమైన కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియాలో ఎప్పుడు తమ అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇక సోషల్ మీడియాలో కూడా కనుమరుగై అభిమానులకు పూర్తిగా దూరమైపోతూ ఉంటారు  అలాంటి హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చాలా ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ లోకి వచ్చి ఏకంగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక హీరోయిన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.


 ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించిన ఒక హీరోయిన్ ఇక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది  ఆమె ఎవరో కాదు సంజన గల్రాణి   ఈ ముద్దుగుమ్మ సోగ్గాడు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో  పాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా నటించింది. యమహో యమ, లవ్ యూ బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా లాంటి సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. 2020లో అజీజ్ పాషా అనే వైద్యుని పెళ్లి చేసుకుంది. ఇక ఇటీవల ఈ హీరోయిన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లోకి రాగా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈమెను చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: