టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి 2024 ఎన్నికలు మంచి అనుబంధాన్ని తీసుకువచ్చాయి. అలాగే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరమైనట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలతో ఇద్దరు హీరోలకు ఉన్న విభేదాలు ఏంటి అసలు గొడవలు ఎక్కడ మొదలయ్యాయనే విషయం గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా బావ బావ అని పిలుచుకునేవారు.. కానీ ఇప్పుడు ఇద్దరికీ కూడా ఒకే పరిస్థితి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా అల్లు అర్జున్ పరిస్థితి విషయానికి వస్తే.. మెగా బ్రాండ్ నుంచి బయటికి రావాలని ఎన్నోసార్లు చూశాడని కూడా వార్తలు వినిపించాయి. 2024 ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడికి సపోర్టు చేశారని మెగా కుటుంబంతో పాటు అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. మెగా కుటుంబంలోని సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్ అల్లు అర్జున్ గురించి పోస్ట్ చేస్తూ ఉండేవారు. అలాగే అల్లు అర్జున్ కి రాంచరణ్ కి మొదటి నుంచి పడదని.. అందుకే అల్లు కొణిదెల ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని సమాచారం. ఇవే కాకుండా ఎన్నో సినీ సందర్భాలలో కూడా వీరి విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా చరణ్ కంటే అల్లు అర్జున్ తన సొంత ఇమేజ్ను బిల్డ్ చేసుకున్నారు.


ఇక నందమూరి ఎన్టీఆర్ గొడవలు విషయానికి వస్తే మొదటి నుంచి తారక్ తో నందమూరి నారా కుటుంబాల మధ్య.. కోల్డ్ వార్ అనేది జరుగుతూనే ఉంది. కొన్ని విషయాలలో బాలయ్య నారా ఫ్యామిలీ వైపు తప్పు ఉన్నట్టుగా కనిపిస్తున్న కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ చేసిన పనులు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాలా చేస్తూ ఉంటాయి. రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు తారక్ మిద కాస్త వ్యతిరేకత తీసుకువచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు గెలుపుకు శుభాకాంక్షలు చెప్పిన తారక్ పైన కూడా విమర్శలు చేశారు. ఇవే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్  పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉండేవి. ఏది ఏమైనా కొంతమంది అభిమానులు కూడా కావాలని ఇలాంటి వైర్యం  సృష్టించేలా కనిపిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: