కేవలం హీరోగా మాత్రమే చేస్తానని కూర్చోకుండా విలక్షణ పాత్రలలో కూడా విజయ్ సేతుపతి నటించడానికి ముందువరుసలో ఉంటాడు. డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన విజయ్ ఫర్జీ వెబ్ సిరీస్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా మెప్పించాడు.ఇంకా హిందీలో కత్రినా కైఫ్ తో మేరీ క్రిస్మస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా మహారాజా అనే మూవీతో విజయ్ సేతుపతి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తమిళ్, తెలుగు భాషలలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు.


జూన్ 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీకి ఒక రేంజ్ లో పాజిటివ్ టాక్ వస్తోంది. విలక్షణమైన పాత్రలో విజయ్, ఇంటరెస్టింగ్ కథాంశంతో దర్శకుడు మెప్పించారనే మాట బాగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని తెలుగులో మైత్రీ శశి రిలీజ్ చేశారు. మొత్తం 1.5 కోట్లకి తెలుగు రిలీజ్ రైట్స్ ని ఆయన కొనుగోలు చేశారు. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే కేవలం 1.8 కోట్ల కలెక్షన్స్ వస్తే చాలు.ఇప్పుడు మహారాజా మూవీకి హిట్ టాక్ కూడా రావడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టం కాదనే మాట కూడా వినిపిస్తోంది. విజయ్ సేతుపతి కెరియర్ ఆరంభంలో చేసిన పిజ్జా సినిమా తెలుగులో అతనికి హీరోగా మంచి సక్సెస్ ఇచ్చింది. మరల ఇన్నేళ్ల తర్వాత తాను హీరోగా నటించిన మహారాజా మూవీ హిట్ టాక్ దిశగా వెళ్తున్నట్లు ఉంది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయితే విజయ్ సేతుపతి మార్కెట్ కూడా తెలుగులో సూర్య, రజినీకాంత్ లాగే మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎంతవరకు వసూళ్లు నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: