ఈ ఏడాది టాలీవుడ్ నుంచి సోషల్ మీడియాను షేక్ చేసిన వైరల్ సాంగ్ ఏదైనా ఉందా అంటే ఠక్కున గుర్తొచ్చేది కుర్చీమడతపెట్టి.ఈ పాట సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన హిట్ మూవీ గుంటూరు కారంని మరోస్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రోమో లాంఛ్ దగ్గరి నుంచి లిరికల్‌ వీడియో, ఫుల్ వీడియో సాంగ్‌.. ఇలా ఫార్మాట్‌ ఏదైనా టైటిల్‌కు తగ్గట్టుగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ పండిస్తూ కుర్చీ మడతపెట్టేస్తుంది ఈ పాట. ఆఫ్ లైన్ సెలెబ్రేషన్స్ లో కూడా ఈ సాంగ్ మొగిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ పాట మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది. యూట్యూబ్‌లో ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకా వ్యూస్ రాబడుతుంది. తొలి రోజు నుంచి నేటి వరకు యూట్యూబ్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు మిగిలిన ప్లాట్‌ఫాంలలో మిలియన్‌కు పైగా రీల్స్‌ చేశారంటే ఈ పాట క్రేజ్‌ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.


ఇక సోషల్‌ మీడియాలో కుర్చీ మడతపెట్టి డైలాగ్‌తో పాపులర్‌ అయిన కుర్చీతాత ఎనర్జ లెవల్స్‌కు మాస్‌ బీట్‌ను జోడిస్తూ కంపోజ్‌ చేసిన ఈ పాటను ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. పైగా ఈ పాట సూపర్ స్టార్ మహేష్ బాబుది కావడం ఆయన మాస్ స్టెప్పులు కుమ్మడంతో ఈ పాట క్రేజ్ గ్లోబల్ లెవెల్ కి చేరుకుంది. ఇక ఇప్పటికే కుర్చీ మడతపెట్టి బీట్‌కు చీరకట్టులో, మోడ్రన్‌ డ్రెస్సులలో అమ్మాయిలు ఇరగదీసే ఊరమాస్‌ స్టెప్పులేస్తూ చేసిన రీల్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం టెక్సాస్ టయోటా సెంటర్‌లో నిర్వహించిన ఎన్‌బీఏ గేమ్ ఈవెంట్‌లో కూడా కుర్చీ మడతపెట్టి పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసి వావ్ అనిపించారు. గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తోనే 250 కోట్లు వసూలు చేసి ఫుల్ రన్ లో హిట్టుగా నిలిచింది. ఇక ఓటిటి, టెలివిజన్ లో అయితే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ పాట కూడా ఇంత పెద్ద హిట్టు కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: