తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ చాలామంది ఉన్నారు. అయితే డైలాగులతో కాదు కేవలం తమ ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులను కడప నవ్వించే వాళ్ళుకూడా కొంతమంది ఉన్నారు. అలాంటి గొప్ప కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది ఉండడం గమనార్హం. ఇలాంటి లిస్టులోకి వస్తాడు కమెడియన్ లక్ష్మీపతి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కమెడియన్ ఆయన. తనదైన శైలిలో మాటకరితనంతో తెలుగు ప్రేక్షకులు అందరిని కూడా ఆకట్టుకుని ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 50 కి పైగానే సినిమాలలో నటించి తన నటనతో ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే లక్ష్మీపతి మొదట రచయితగా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చంద్రలేఖ అనే సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. ఆ తర్వాత కమెడియన్ అవతారం ఎత్తి  ప్రేక్షకులను నవ్వించారు. అయితే ఇప్పుడు లక్ష్మి పతి కొడుకు టాలీవుడ్ లో మంచి హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన ఎవరో కాదు సంతోష్ శోభన్. అదేంటి సంతోష్ శోభన్ డైరెక్టర్ శోభన్ కొడుకు కదా. మరి లక్ష్మీపతి కొడుకు ఎలా అవుతాడు అనుకుంటున్నారు కదా. లక్ష్మీపతికి సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయానా తమ్ముడు అవుతాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహేష్ బాబు తో బాబి, ప్రభాస్ తో వర్షం సినిమాలని తీసిన దర్శకుడు శోభన్ ఇక సూపర్ హిట్లను అందుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ఆకస్మిక మరణం చెందారు. అయితే శోభన్ చనిపోయిన నెలరోజులకే లక్ష్మీపతి కూడా మరణించడం అప్పట్లో ఇండస్ట్రీలో అందరిని బాధ పెట్టింది. కాగా శోభన్ కొడుకులు ఇప్పుడు ఇండస్ట్రీలో టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు సంతోష్ శోభన్ 2011లోనే గోల్కొండ హై స్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నాడు  అతని తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటుడుగా రాణిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: