సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించగా , జ్ఞాన సాగర్ ద్వారకమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధిస్తే బ్రేక్ ఈ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 2 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా  సీడెడ్ ఏరియాలో ఒక కోటి , ఉత్తరాంధ్ర లో 1.10 కోట్లు ,  ఈస్ట్ లో 25 లక్షలు , వేస్టు లో 20 లక్షలు , కృష్ణ లో 30 లక్షలు , గుంటూరు లో 32 లక్షలు , నెల్లూరు లో 22 లక్షలు , మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.39 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు , ఓవర్ సీస్ లో 30 లక్షలు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 5.99 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 6.3 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6.3 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb