టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది స్టార్ హీరోలు సీనియర్ హీరోలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఏకంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మెగాస్టార్ గా మారిపోయారు అని చెప్పాలి. దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు అటు టాలీవుడ్ ను నెంబర్ వన్ హీరోగా ఏలాడు చిరంజీవి  ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలలో విశ్వంభర మూవీ కూడా ఒకటి. బింబిసార అనే సోషియో ఫాంటసీ మూవీ ని తీసి తన దర్శకత్వంతో అందరిని మెప్పించగలిగిన యువ దర్శకుడు వశిష్ట  ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూవీ గురించి ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చిన అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతోంది.


 కాగా వశిష్ట చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభరా మూవీ గురించి ఇక ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తారు అన్న విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచింది చిత్ర బృందం. సినిమాలో కునాల్ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించనున్నట్లు ఒక టాక్ మాత్రం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటికే ఈయనపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ మూవీ తెరక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. అశీక కూడా మరో పాత్రలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: