యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది.600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ మూవీని నిర్మించింది. ఇప్పటికే కల్కి 2898 ఏడీ నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో విజువలైజేషన్, కంటెంట్ ప్రెజెంటేషన్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది.అందుకే ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మొదటి రోజు కల్కి మూవీ సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అన్ని రికార్డులని బ్రేక్ చేసి వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం అని ట్రేడ్ పండితులు సైతం అంటున్నారు. 


ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బిజినెస్ కంప్లీట్ అయిపొయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి.వీలైనంత స్ట్రాంగ్ గా ఈ సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్లాలని మూవీ యూనిట్ భావిస్తోంది. అందుకే అన్ని రకాలుగా ప్రమోషన్ స్ట్రాటజీలని ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కల్కి మూవీ నుంచి భైరవ ఆంథమ్ ప్రోమోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఫుల్ సాంగ్ ని జూన్ 16 వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రోమోలో దల్జీత్ దోసాంజ్ ఇంకా ప్రభాస్ ని ఎస్టాబ్లిష్ చేశారు.దీనిని బట్టి చూస్తుంటే ఈ సాంగ్ లో ఇద్దరు నటించినట్లు తెలుస్తోంది. ఇంకా అలాగే ఇండియాలోనే స్టార్ సింగర్ గా దూసుకుపోతున్న దల్జీత్ ఈ సాంగ్ ని పాడటం అంచనాలని పెంచేస్తుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. భైరవ ఆంథమ్ కచ్చితంగా ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాకి మరింత ఊపు తీసుకొచ్చే ప్రయత్నం మూవీ యూనిట్ చేస్తోంది. పంజాబీ స్టైల్ లోనే ఈ ఆంథమ్ సాంగ్ ఉండబోతోందని ప్రోమో బట్టి అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: