చిన్నారి పెళ్లి కూతురు అనే డబ్బింగ్ సీరియల్‌ ద్వారా చాలా కాలం క్రితమే బాల నటిగా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది అవికా గోర్. ఆ తరువాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది.ఈ హాట్ బ్యూటీ నటించిన సినిమాల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచిన కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేయలేక ఆగిపోయింది. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకుని న్యూ లుక్ తో రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.  తెలుగులో ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. కానీ కొత్త హీరోయిన్ల హాట్ డామినేషన్ వల్ల అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తరువాత హాట్ గా స్కిన్ షో చేసినా కూడా అవికాకి ఫలితం దక్కలేకపోయింది. 


ప్రస్తుతం హిందీ, తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ ను సాగిస్తున్న ఈ అమ్మడికి తాజాగా 1920 అనే హర్రర్‌ కాన్సెప్ట్‌ మూవీ ఆఫర్‌ దక్కింది. ఆ మూవీలో శృతి మించిన శృంగార సన్నివేశాలు చేయాల్సి వచ్చిందట. ఆ సన్నివేశాల షూటింగ్ అనుభవం గురించి అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంకా అవికా గోర్‌ మాట్లాడుతూ... చాలా మంది శృంగార సన్నివేశాలు సరదాగా ఉంటాయని భావిస్తారు. కానీ ఆ సన్నివేశాల షూటింగ్ చాలా బోరింగ్‌ గా ఉంటాయి. అసలు ఆ సన్నివేశాలు చేసే సమయంలో ఏమాత్రం ఉత్సాహం ఉండదు అన్నట్లుగా అవికా గోర్ చెప్పుకొచ్చింది. అలాంటి సీన్స్ చేసే సమయంలో ఏది అవసరమో అదే చేస్తూ ఉంటాం. ఆ సమయంలో షూటింగ్‌ అనే ఫీలింగ్‌ తప్ప మరోటి ఉండదు అన్నట్లుగా అవికా గోర్ చెప్పుకొచ్చింది. రొమాంటిక్ సన్నివేశాలను బోరింగ్‌ అంటూ చెప్పేసిన అవికా కామెంట్స్ చాలా మందికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: