సుకుమార్‌, బన్నీ కాంబోలో 2021 చివర్లో వచ్చిన పుష్ప సినిమా దేశావ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర ఏళ్లు పూర్తి అయినా కూడా పుష్ప సినిమా గురించి చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతూనే ఉంది.ఆ మూవీలోని పాటలు ఇంకా తెగ మోగుతూనే ఉన్నాయి.ఇంతలోనే పుష్ప 2 పాటల సందడి కూడా షురూ అయ్యింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కపుల్‌ సాంగ్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కింది.తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ రాబట్టి సెంచరీ కొట్టింది.ఇప్పటి దాకా కూడా అన్ని భాషల్లో కలిపి కపుల్‌ సాంగ్‌ వంద మిలియన్‌ ల వ్యూస్ ను రాబట్టడంతో పాటు లక్షల్లో లైక్స్‌ ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఏ పాటకు దక్కని ఆధరణ సూసేకి... పాటకు దక్కింది.


పుష్ప 2 మూవీ పై ఉన్న అంచనాలు ఇంకా సినిమాకు ఉన్న బజ్ ను రెట్టింపు చేసిన పాట అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప 2 సినిమాను నిన్న మొన్నటి దాకా ఆగస్టు 15న విడుదల చేస్తారని అంతా భావించారు. ఆ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాని గత రెండు రోజుల నుంచి విడుదల విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ప్రస్తుతానికి పుష్ప 2 సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ నుంచి డేట్‌ మార్పు ప్రకటన అనేది రాలేదు. కాబట్టి ఆగస్టు లోనే సినిమా విడుదల చేయాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.ఈ సినిమా విడుదల అవ్వక ముందే వంద మిలియన్ల వ్యూస్ వస్తే సినిమా విడుదల అయ్యి హిట్‌ అయితే తక్కువ సమయంలోనే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వ్యూస్ రావడం ఖాయం అనిపిస్తుంది. పుష్ప 2 సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు వసూళ్లు రాబడుతుందని ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సుకుమార్ ఈ సినిమాని జాగ్రత్తగా తీస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: