టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ నిర్మాత నాగ్ అశ్విన్ మామ అయిన అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి చాలా గ్రాండ్ గా హాలీవుడ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈనెల 27వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రాజమౌళికి ధీటుగా ఈ సినిమాతో పెద్ద పాన్ వరల్డ్ హిట్టు కొట్టి తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు నాగ్ అశ్విన్.ఇక కల్కి సినిమా కనుక సూపర్ హిట్ అయితే పెద్ద హీరోలు అందరూ నాగ్ అశ్విన్ చుట్టూ ఖచ్చితంగా క్యూ కడతారని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎన్నో భారీ అంచనాలైతే ఉన్నాయి.


ఇక 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1500 కోట్లు రాబడుతుందనే ధీమాతో మూవీ యూనిట్ అయితే ఉన్నారు. హాలీవుడ్ కి మార్వెల్ శిరీస్ ఎలాగో టాలీవుడ్ కి కల్కి శిరీస్ అని అంటున్నారు మేకర్స్.  అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ అయితే ఇవ్వడం లేదు...ఇది ఒకటి తెలిస్తే తప్ప ప్రేక్షకులు కల్కి సినిమా పైన సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఒక్క విషయం మీద మాత్రం నాగ్ అశ్విన్ మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే సినిమాకి ఎండింగ్ లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ఇస్తారా లేదా అనేది కూడా మనకు సినిమా చూస్తే గాని ఒక క్లారిటీ  వచ్చే విధంగా కనిపించడం లేదు.. కానీ ట్రైలర్ లో కమల్ హాసన్ ని చూసాకా మాత్రం ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే విషయం స్పష్టం అవుతుంది. మరి చూడాలి ఈ సినిమాకి ఎన్ని పార్ట్స్ ఉంటాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: