టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రష్మిక మందన హీరోయిన్గా భరత్ కమ్మ దర్శకత్వంలో కొంత కాలం క్రితం డియర్ కామ్రేడ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు విజయ్, రష్మిక కాంబోలో రూపొందిన గీత గోవిందం అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో విరి కలయికలో రూపొందిన రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా 2019 వ సంవత్సరం థియేటర్లలో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ కి విమర్శకుల నుండి పర్వాలేదు అనే స్థాయిలో ప్రశంసలు వచ్చిన జనాల నుండి మాత్రం ఈ మూవీ కి పెద్ద స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను మాత్రం అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ ను కొంత కాలం క్రితమే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

ఇక ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్ కి ఏకంగా 400 మిలియన్ ప్లస్ వ్యూస్ యూట్యూబ్ లో వచ్చాయి. ఇలా విజయ్ దేవరకొండ , రష్మిక కెమిస్ట్రీ కి హిందీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ ... చైతన్య అనే పాత్రలో నటించగా , రష్మిక ... లిల్లీ పాత్రలో నటించింది. ఈ మూవీ లోని వీరి నటనకు కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd