పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితం జనసేన అనే పార్టీని స్థాపించాడు. ఇక ఆయన పార్టీ స్థాపించిన తర్వాత ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా గట్టిగా , ధైర్యంగా నిలబడ్డాడు. ఆ ధైర్యానికి నిదర్శనంగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో ఈయన పార్టీ నుండి నిలబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలుపొందాడు. దానితో ఒక్క సారిగా పవన్ అంటే ఏమిటి అనేది రుజువు అయ్యింది. ఇకపోతే తాజాగా పవన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అందులో పవన్ ఒక తక్కువ ధర పెన్నుతో సంతకాలు చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దానితో ఇంత గొప్ప స్థాయి ఉన్న వ్యక్తి అంత తక్కువ ధర ఉన్న పెన్నుతో సంతకం చేయడం ఏమిటి అని కొంత మంది , మరి కొంత మంది అది ఆయన సింప్లిసిటీ కి నిదర్శనం , పెన్ కాస్ట్ లో ఏముంది పెట్టే సంతకానికి వ్యాల్యూ ఉండాలి అని మరి కొంత మంది అంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తక్కువ ధరతో కూడిన పెన్ తో సంతకాలు చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్న సమయం లోనే మరో విషయం కూడా వైరల్ గా మారింది.

అదేమిటంటే పవన్ కళ్యాణ్ సోదరుడు మరియు వదిన అయినటువంటి చిరంజీవి , సురేఖ తాజాగా పవన్ కళ్యాణ్ కి ఓ పెన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. చిరంజీవి , సురేఖ స్పెషల్ గా పవన్ కి పెన్ గిఫ్ట్ ఇవ్వడంతో దాని ధర ఎంత అనేది తెలుసుకోవడంలో చాలా మంది నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరు , సురేఖ తాజాగా పవన్ కు గిఫ్టుగా ఇచ్చిన పెన్ దర 2 లక్షల 53 వేల 975 చిల్లర అని తెలుస్తుంది. మరి ఇది డిస్నీ వెర్షన్ పెన్ అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: