టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఆనంద్ దేవరకొండ తాజాగా గం గం గణేశా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే . బేబీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఆనంద్ నటించిన సినిమా కావడం తో మొదటి నుండి ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు . అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా మే 31 వ తేదీ న థియేటర్ లలో విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా డీసెంట్ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ని జూన్ 28 వ తేదీ నుండి ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి  ప్రగతి శ్రీవాస్తవ , నయన్ సారిక హీరోయిన్ లుగా నటించారు. ఇమ్మాన్యుయెల్ , వెన్నెల కిషోర్ తదితరులు ఈ మూవీ లో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ ఏ రోజు నుండి ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad