సోషల్ మీడియా కారణంగా హోటల్ నడిపే కుమారి ఆంటీ సెలబ్రిటీల రేంజ్‌లో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యింది. ఈమె అసలు పేరు దాసరి సాయి కుమారి. కానీ కుమారి ఆంటీగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు కుమారి ఆంటీ అంటే తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశక్తి కాదేమో.

13 ఏళ్లుగా హైదరాబాద్‌లో రోడ్ సైడ్ హోటల్ నడుపుతున్న ఈమె ఈ ఏడాది మొదట్లో చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఆమె వంట రుచి చూడాలని వందల మంది "కుమారి అండ్ స్ట్రీట్ ఫుడ్" స్టాల్‌కు ఇప్పటికీ పోటెత్తుతున్నారు. ట్రాఫిక్‌కు కూడా ఇబ్బంది కలగడం వల్ల ఒకానొక సమయంలో పోలీసులు ఆమె బిజినెస్‌ను మూసి వేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. చివరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె హోటల్ మూసివేయొద్దని చెప్పడంతో పోలీసులు అడ్డుతొలిగారు.

దీని తర్వాత ఆమె మరింత పాపులర్ అయ్యింది. కొన్ని టీవీ ఛానళ్ల సీరియల్స్‌లో కూడా ఆమెను నటింపజేశారు. ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపించి ఆశ్చర్యపరిచింది. "రెండు లివర్లు ఎక్స్‌ట్రా మీది మొత్తం రూ.1,000 అయింది." అంటూ ఆమె చెప్పిన డైలాగు ఇప్పటికీ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆమె డైలాగ్‌ను వాడేశారు. కుమారి ఆంటీ బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారని వార్తలు వచ్చాయి. సాధారణంగా బిగ్ బాస్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్లని తీసుకొచ్చి హౌస్ లో పెడుతుంది. కుమారి ఆంటీ విషయంలో కూడా అలానే జరుగుతుందని అందరూ కామెంట్ చేస్తూ వచ్చారు, చివరికి వారి కామెంట్లయే నిజం కాబోతున్నాయని తెలుస్తోంది.

ఈసారి సీజన్‌లో కుమారి ఆంటీ ని ఒక కంటెస్టెంట్ గా తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్‌ నిర్ణయించిందట. ఈ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకొద్ది నెలల సమయం ఉంది. అయితే కుమారి ఆంటీని షోలో తీసేసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఆల్రెడీ ఆహ్వానం కూడా పంపారట. అయితే ఆమె తుది నిర్ణయం ఇంకా చెప్పలేదని తెలుస్తోంది ఒకవేళ ఆమె ఓకే చెప్తే ఈసారి హౌస్ లో సందడి చేసే అవకాశం ఉంది. చూడాలి మరి చివరికి ఆమె బిగ్బాస్ హౌస్‌లో అడుగు పెడుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: