పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో వరస సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాల వైపు కూడా సమయాన్ని కేటాయించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితం పవన్ జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుండి పోటీ చేసి మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. 

ఇక ఈ సారి తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ విజయంలో కీలకపాత్రను పోషించిన పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం మాత్రమే కాకుండా అనేక మంత్రిత్వ శాఖలను కూడా చంద్రబాబు నాయుడు పవన్ కి ఇచ్చాడు. దానితో పవన్ కు ఎంతో మంది అభినందనలు తెలుపుతున్నారు. ఇక తన కుటుంబ సభ్యులు అయినటువంటి చిరంజీవి, సురేఖ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఒక విలువైన పెన్ ను బహుమతిగా ఇచ్చారు. ఈ పెన్ ఖరీదు దాదాపు రెండున్నర లక్షలు అని వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ మేనల్లుడు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కి తాజాగా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. స్టార్ వార్స్ అండ్ లెగో  కిట్‌ను సాయి ధరమ్ తేజ్  బహుమతిగా అందజేశారు. స్టార్ వార్స్ లెగోలను నాకు పరిచయం చేసిన వ్యక్తి నా ప్రియమైన జేడీ మాస్టర్ స్టార్ వార్ కల్పిత  పాత్రను డిప్యూటీ సీఎం కు ఎట్టకేలకు ఒక బహుమతి ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sdt