మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి పాయల్ రాజ్పుత్ , కార్తికేయ హీరో గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం అలాగే ఈమె అందులో తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ బ్యూటీ కి ఆ తర్వాత తెలుగు లో వరుస అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదల అయిన తర్వాత ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందిన రక్షణ అనే సినిమాలో నటించింది.

లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించింది. ఇకపోతే అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంత కాలం పాటు విడుదల కాలేదు. ఇకపోతే ఈ మూవీ ని తాజాగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి గుర్తింపు దక్కలేదు. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయిలో కలెక్షన్ లు కూడా రాలేదు.

ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఆహా ఓ టి టి సంస్థ వారు దక్కించుకున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ మూవీ ని జూన్ 21 వ తేదీ నుండి ఆహా ఫ్లాట్ ఫామ్ వారు తమ ఓ టి టి లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ జూన్ 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా కేవలం 15 రోజులు కూడా తిరగకుండానే ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: