తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న తాజాగా మనమే అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ కి వషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ జూన్ 7 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 9 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి 9 రోజుల్లో నైజాం ఏరియాలో 2.97 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 73 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.14 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 9 రోజుల్లో ఈ సినిమాకి 2  తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.84 కోట్ల షేర్ ... 13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 9 రోజుల్లో 53 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1 కోటి కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 9 రోజుల్లో 8.37 కోట్ల షేర్ ... 16.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 1.63 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: