తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన హీరోగా నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది.

కానీ ఆ మూవీ మిస్ అయింది. అసలు విజయ్ , రవి బాబు కాంబోలో మిస్ అయిన సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. రవిబాబు కొన్ని సంవత్సరాల క్రితం అవును అనే హార్రర్ జోనర్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో మొదట విజయ్ దేవరకొండ ను హీరో గా తీసుకోవాలి అని రవి బాబు అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఆయనను కాకుండా వేరే వారితో ఈ సినిమా చేయవలసి వచ్చింది అంట. ఇకపోతే కొన్ని రోజుల క్రితం రవి బాబు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మీ వల్ల విజయ్ హర్ట్ అయ్యాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది అనే ప్రశ్న ఆయనకు ఎదురు అయింది. దానికి అయినా సమాధానం ఇస్తూ. .. నేను దర్శకత్వం వహించిన నచ్చావులే సినిమాలో విజయ్ ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సమయంలో మా ఇద్దరికీ పడలేదు అని వార్తలు రాస్తున్నారు. అది అవాస్తవం. నచ్చావులే సినిమా తర్వాత మేమిద్దరం కలిసి అనేక సినిమాలలో నటించాం. అలా మా ఇద్దరికీ గొడవలే ఉంటే మేమెందుకు కలిసి ఎందుకు నటిస్తాం అని రవిబాబు సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd