కాంతర చిత్రంతో మంచి పాపులారుటి సంపాదించుకున్న హీరోయిన్  సప్తమి గౌడ ప్రతి ఒక్కరికే సుపరిచిమే. కన్నడలో పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ కాంతర చిత్రంతోనే మంచి పాపులారిటీ అందుకున్నది. ఈ చిత్రంలో ఈమె డి గ్లామరస్ పాత్రలో నటించి మెప్పించింది. అలాగే ఈ చిత్రంలో తన అందంతో కూడా అందరిని ఆకట్టుకుంది సప్తమి గౌడ. అలాగే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో నటించిన ది వ్యాక్సిన్ వార్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా పరవాలేదు అనిపించుకుంది.


కన్నడ భాషలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సప్తమి గౌడ మంచి పాపులారిటీ సంపాదించుకొని సోషల్ మీడియాలో కూడా మరింత క్రేజీ అందుకుంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఒక హీరో భార్య పైన ఈమె కేసు వేసినట్లు సమాచారం. ఒక హీరో భార్య తన పైన తప్పుడు ప్రచారం చేస్తోందంటు ఆమె కోర్టులో కేసు వేయడం జరిగింది.. గత కొద్దిరోజులుగా కన్నడ ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారం ఎక్కువగా వినిపిస్తోంది. చాలామంది స్టార్ కపుల్స్ మధ్య ఈ వ్యవహారం జరుగుతూనే ఉంది. అలాంటి వారిలో శివరాజ్ కుమార్ ఫ్యామిలి కి చెందిన యువరాజు కుమార్ కూడా ఒకరు.


యువరాజ్ కుమార్ తన భార్య నుంచి విడాకులు కోరారని తన భార్య తనను వేధిస్తోందని యువరాజ్ విడాకులు ఇవ్వాలంటే వెల్లడించారు.. అలాగే ఆయన భార్య శ్రీదేవి మాత్రం ఒకరి పైన ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారని అది హీరోయిన్ సప్తమి గౌడను ఈ కేసులో లాగింది.. సప్తమి గౌడ, యువరాజ్ ప్రేమలో ఉన్నారంటూ ఆమె ఆరోపిస్తోంది.. శ్రీదేవి భైరవ అమెరికాకు వెళ్ళినప్పుడు యువ రాజ్,సప్తమి కలిసి జీవించారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఆమె కోసమే తనని ఇంటి నుంచి బయటికి గెంటేసారంటూ శ్రీదేవి ఆరోపిస్తోంది. ఈ విషయం పైన సప్తమి సీరియస్ అవుతూ సప్తమి గౌడ శ్రీదేవి కోర్టులో కేసు వేశారు.. శ్రీదేవి తన పైన నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చిందని తప్పుడు ఆరోపణలు చేసిందంటూ సప్తమి ఆరోపించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: