తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయి ఆకట్టుకుంటాయి.రీసెంట్ గా ఆయన హీరోగా చేసిన మహారాజ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 14వ తేదీన విడుదల అయిన  ఆ సినిమా.. మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన మహారాజ సినిమా కాన్సెప్ట్ అదిరిపోయిందని చెబుతున్నారు.ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో చూడదగ్గ మూవీ అని మౌత్ టాక్ రావడం.. సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌ గా మారింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ వేరే లెవల్ అని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 1915 స్క్రీన్లలో రిలీజైన ఆ సినిమా .. అన్ని సెంటర్లో భారీ వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఖచ్చితంగా వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేశాయి.ఈ మూవీని చూసేందుకు మూవీ లవర్స్ మంచి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 


ప్రముఖ టికెట్ సెల్లింగ్ యాప్ బుక్ మై షోలో గత 24 గంటల్లో సుమారు ఏకంగా రెండు లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయి. ఏకంగా 1,99,340మంది సినిమా చూసేందుకు టికెట్లు కొనుగోలు చేశారు. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మహారాజ సినిమా థియేట్రికల్ రన్ చాలా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా నిథిలన్ తెరకెక్కించిన ఆ మూవీలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా ఇంకా అరుల్‍ దాస్ కీలకపాత్రలు పోషించారు.అలాగే విజయ్ తో పాటు మిగతా యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌ కు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అజనీష్ ఇచ్చిన మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. కూడా ఈ సినిమాకు మెయిన్ అసెట్ గా మారింది. సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.మరోవైపు, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‍ ఫ్లిక్స్.. థియేటర్లలో విడుదలకు ముందే డీల్ సెట్ చేసుకుని కొనుక్కుంది. దీంతో ఈ సినిమా వచ్చే నెల రెండో వారం లేకపోతే మూడో వారంలో స్ట్రీమింగ్‍ అవుతుందనే సమాచారం వినిపిస్తోంది. అప్పటికీ థియేటర్ల మంచి వసూళ్లు రాబడుతుంటే.. స్ట్రీమింగ్ మరింత ఆలస్యం కావచ్చని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: