మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర '.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ అక్టోబర్ 10 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.కానీ తాజాగా ఆ తేదీ కంటే ముందే అంటే సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా మాస్ మహారాజ్ మూవీ రాబోతుంది.

మాస్ మహారాజ్ రవితేజ,స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై  టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు .ఈ సినిమా లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది.ఇదిలా ఉంటే జూన్ 17 న ఈ సినిమా నుంచి షో రీల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఎన్టీఆర్ సినిమా పోటీలో వున్నా కూడా రవితేజ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది.దీనితో ఈ ఇద్దరి స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: