పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "కల్కి 2898 AD " .మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఈ సినిమా తరువాత ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్  దర్శకత్వం  లో ప్రభాస్ సలార్ 2  చేయబోతున్నాడు.అయితే ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ మూవీ  షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కానుండటంతో సలార్ 2 మూవీ షూటింగ్  ఆలస్యం కానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో "రాజా సాబ్ "సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కానుంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో మరో దర్శకుడు కూడా ఉన్నాడు.ఆ దర్శకుడు ఎవరో కాదు సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి.ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ముందుగా ప్రభాస్ ,పఠాన్ ఫేమ్ సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ఓ మూవీ ప్లాన్ చేసింది.అది వర్క్ అవుట్ కాకపోవడం తో ప్రభాస్ ,హను రాఘవపూడి సినిమా సెట్ చేసింది.ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది .ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమా కు హను రాఘవపూడి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.అలాగే ప్రభాస్ ,సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ అనే మూవీ కూడా రానుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: