కొంతమంది హీరోలకు కొన్ని నెలలు లేదా కొన్ని తేదీలు సెంటిమెంట్ గా ఉంటాయి. ఎందుకు అంటే ఆ నెలలో లేదా ఆ తేదీన విడుదల అయిన సినిమాలు వారి కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నట్లు అయితే మరోసారి అలాంటి సమయంలోనే తమ సినిమాలను విడుదల చేయడానికి హీరోలు ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా ఆ తేదీని లేదా ఆ నెలలోనే సినిమాలను విడుదల చేయడానికి కొంత మంది హీరోలు ప్రయత్నిస్తూ తమ సినిమాలను పూర్తి చేస్తూ వస్తే కొంత మంది మాత్రం అనుకోకుండా ఆ సమయానికి ఆ సినిమా పనులు పూర్తి అయినట్లు అయితే అదే నెలలో లేదా ఆ తేదీనే సినిమాలు విడుదల చేయడానికి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంటారు.

ఇకపోతే బాలకృష్ణ కూడా అలాంటి సెంటిమెంట్ నే ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు బాలకృష్ణ కు కొన్ని అపజయాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది.

ఇక ఆ తర్వాత బాలకృష్ణ నటించిన విర సింహా రెడ్డి మూవీ ని కూడా ఇదే నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా జనవరి నెలలో విడుదల అయింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ "ఎన్ బి కే 109" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు , అందుకు సంబంధించిన ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk