తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు ఈయన అట్లీ రాజా రాణి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో మొదటి మూవీ తోనే ఈ దర్శకుడికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఈయన వరుసగా విజయ్ హీరోగా రూపొందిన తేరి , మెర్సెల్ , బిగిల్ సినిమాలకు దర్శకత్వం వహించి మూడింటితో కూడా మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్థాయి ఉన్న దర్శకుడిగా మారిపోయాడు.

ఈ మూడు సినిమాలు కూడా తెలుగులో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ దర్శకుడు బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ హిందీ , తమిళ్ , తెలుగు భాషలలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ దర్శకుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ తో మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ఆల్మోస్ట్ వీరిద్దరి కాంబోలో మూవీ సెట్ అయినట్లే తెలుస్తుంది. ఈ సినిమా కోసం అట్లీ దిమ్మ తిరిగిపోయే రెమ్యూరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా విజయం సాధించడం , అలాగే ఆఖరుగా అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టడంతో ఈ దర్శకుడు ఏకంగా తన రెమ్యూనిరేషన్ గానే 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: