టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభంలో కమీడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సునీల్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభించిన కొత్తలో ఎక్కువ శాతం కామెడీ సినిమాలలోనే నటిస్తూ వచ్చాడు. వాటితోనే ఈయనకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాంటి సమయంలో సునీల్ "అందాల రాముడు" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత కూడా కమెడియన్ గా కంటిన్యూ అయినా సునీల్ ఆ తర్వాత కొంత కాలానికి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీనితో సునీల్ ఆ తర్వాత కమీడియన్ పాత్రలలో నటించడం మానేసి కేవలం సినిమాలో హీరోగా నటిస్తూ వచ్చాడు. కానీ ఈయన హీరోగా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కావడంతో మళ్లీ ఈయన రూట్ మార్చి సినిమాల్లో కమెడియన్ , విలన్ , ముఖ్య పాత్రలలో నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన విలన్ పాత్రలో బాగా సూట్ అవ్వడంతో వరుసగా ఈయనకు సినిమాల్లో విలన్ పాత్రలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

కానీ సునీల్ మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ కే సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలకు ఏ మాత్రం బరువు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈయన తక్కువ పారితోషకానికి సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సునీల్ కేవలం 40 రెమ్యూనరేషన్ కి ఒక మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత క్రేజ్ ఉండి కూడా ఇంత తక్కువ పారితోషకానికి సినిమాలు చేయడం గ్రేట్ అని చాలా మంది అంటున్నారు. ఇక సునీల్ ప్రస్తుతం అనేక సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: