మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక మెగా వారసుడిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన మెగాస్టార్ ఇటీవల తాతగా ప్రమోట్ అయ్యాడు. పెళ్లయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. గత ఏడాది జూన్ 20న క్లీన్ కారా పుట్టింది. మనవరాలు రాకతో మెగా కుటుంబంలో అంతా సంతోషమే వెదజల్లింది. చిరంజీవి సైతం మనవరాలు రావడంతో ఎంతో సంతోషంగా

 ఉన్నాను అని ఇదివరకే చాలాసార్లు తెలిపాడు. అయితే ఇటీవల తాతా మనవరాలి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడిన పలు మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. క్లీంకార రాకతో తన మొదటి ఫాదర్స్ డేని జరుపుకుంటున్న రామ్ చరణ.. ఓ నేషనల్ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో క్లీంకార గురించి అనేక విషయాలను పంచుకున్న రామ్

 చరణ్, చిరు-క్లీంకార బంధం గురించి మాట్లాడుతూ.. ‘క్లీంకారతో ఉన్నప్పుడు చిరంజీవి కూడా ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడట. క్లీంకార తనని కొడుతుంటే చిరంజీవి బాగా ఎంజాయ్ చేస్తుంటారట’. కాగా క్లీంకార తనని తాత అని పిలవడం చిరంజీవికి ఇష్టం లేదంట. దీంతో తనని పిలవడం కోసం చిరంజీవి ఓ పేరుని పెట్టుకున్నారట. ఆ పేరుని కూడా చరణ్ తెలియజేసారు. తనని తాత అని పిలవద్దని, అది చాలా బోరింగా ఉందని, తనని ‘చిరుత’ అని పిలవమని చిరంజీవి చెబుతుంటారట.  అలా మొత్తానికి మెగా ప్రిన్సెస్ కోసం మెగాస్టార్ చిరంజీవి తన పేరుని మార్చుకున్నాడు అన్నమాట దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: