నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం "ఎన్బికె 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఓ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న ఇప్పటివరకు ఈ సినిమా యొక్క విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. ఇక ఈ సినిమా యొక్క విడుదల తేదీ గురించి మేకర్స్ ఇన్ని రోజుల పాటు అనేక ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇంతకాలం పాటు ఈ మూవీ బృందం ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే డిసెంబర్ నెలలో ఇప్పటికే అనేక సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉండడం, అలాగే పుష్ప పార్ట్ 2 మూవీ కూడా ఆగస్టు నుండి డిసెంబర్ కి వాయిదా పడినట్లు వార్తలు రావడంతో "ఎన్ బి కే 109" మూవీ ని అక్టోబర్ నెలలో విడుదల చేయాలి అని ఈ మూవీ బృందం వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక అక్టోబర్ 5 వ తేదీన ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తున్న దేవర మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దానితో అక్టోబర్ 5 వ తేదీన "ఎన్ బి కే 109" మూవీ ని విడుదల చేస్తే బాగుంటుంది అని ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు, త్వరలోనే అందుకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk