సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మాళవిక శర్మ ఈ మూవీలో హీరోయిన్గా నటించగా ... జ్ఞాన సాగర్ ద్వారక ఈ మూవీకి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ జూన్ 14వ తేదీన థియేటర్లలో విడుదల అయింది . ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి మొదటి రోజు మంచి కలక్షన్లనే రాబట్టుకున్నప్పటికీ ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గాయి. ఈ మూవీకి రెండు రోజుల్లో కలిపి వరల్డ్ వైడ్ గా 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే 1.49 కోట్ల షేర్ కలక్షన్ వచ్చినట్లు సమాచారం. ఈ మూవీ  ప్రపంచవ్యాప్తంగా 6.50 కోట్ల బ్రేక్ టార్గెట్ టి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది.

దానితో ఈ మూవీ మరో ఐదు కోట్ల వరకు షేర్ కలక్షన్ రాబడితేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం ఓ వైపు మహారాజా సినిమా అద్భుతమైన జోష్ లో కలెక్షన్లను రాబడుతుంది. అలాగే మనమే సినిమా కూడా మంచి హోల్డునే కనబరుస్తుంది. దానితో హరోం హరా సినిమా మిగిలిన ఐదు కోట్ల షేర్ కలక్షన్ రాబట్టడం కాస్త కష్టం గానే కనపడుతుంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb