సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల , దేవియాని శర్మ , గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో మా ఊరి పొలిమేర అనే సినిమా కొంత కాలం క్రితం రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగంపై ప్రేక్షకుల్లో ఏ మాత్రం అంచనాలు లేకపోవడంతో ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇక ఈ మూవీ ఓ టి టి లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కొనసాగింపుగా "మా ఊరి పొలిమేర 2" ను రూపొందించారు.

ఈ మూవీని నేరుగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ లో కూడా సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల , దేవియాని శర్మ , గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. ఇకపోతే థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఓ టి టి ప్రేక్షకులను కూడా అలరించడంలో బాగానే సక్సెస్ అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్న ఇప్పటివరకు ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం కాలేదు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: