అత్యంత క్రేజ్ ఉండి అత్యంత డిలే అవుతున్న సినిమాలలో గేమ్ చేంజర్ మూవీ ఒకటి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్మూవీ లో హీరోగా నటిస్తూ ఉండడం, దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ స్టార్ట్ అయిన టైం నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత శంకర్ మొదలు పెట్టి ఆపేసిన ఇండియన్ 2 సినిమాను కూడా మళ్లీ రీ స్టార్ట్ చేశాడు.

దానితో ఏకకాలంలో ఈ రెండు మూవీల షూటింగ్లను పూర్తి చేస్తూ రావడంతో గేమ్ చేంజర్ చిత్రం అనుకున్న దాని కంటే చాలా డిలే అవుతూ వస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఒకటి, రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఒక పాటను మినహాయిస్తే మేకర్స్ ఏ ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయలేదు. ఇక ఈ మూవీకి సంబంధించిన వ్యక్తులు ఎప్పటికప్పుడు ఈ మూవీని అప్పుడు విడుదల చేయాలనుకుంటున్నాం... ఇప్పుడు విడుదల చేయాలనుకుంటున్నాం అని అంటున్నారే తప్ప అఫీషియల్ గా ఏ తేదీని కూడా ప్రకటించడం లేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు తాజాగా యూ ఎస్ ఏ కి వెకేషన్ కు వెళ్లిన విషయం మనకు తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే ఈయన వెకేషన్ ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి రానున్నాడు. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే దర్శకుడు శంకర్ తో ముచ్చటించనున్నట్లు, అందులో భాగంగా సినిమా తేదీ గురించి ఆయన ప్రధానంగా శంకర్ తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ శంకర్ కనుక పలానా టైమ్ వరకు సినిమా పనులు అన్ని పూర్తి కానున్నట్లు చెప్పినట్లు అయితే ఆ తేదీ తర్వాత ఒక మంచి డేట్ ను లాక్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: