విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో దివ్య భారతి విజయ్, సేతుపతి కి భార్య పాత్రలో నటించగా ... మమతా మోహన్ దాస్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ జూన్ 14 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్లు దక్కాయి. ఇంకా ఎన్ని కలెక్షన్ లను సాధిస్తే ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల్లో ఈ సినిమాకి నైజాం ఏరియాలో 85 లక్షల కలెక్షన్లు దక్కగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 1.70 కోట్ల షేర్ , 3.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 1.80 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ మూవీ కి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ సినిమా అవలీలగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకునేలా ఉంది. అలాగే భారీ లాభాలను కూడా ఈ సినిమా అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs