తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నటులలో వరుణ్ సందేశ్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను, అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన కొత్త బంగారు లోకం అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈయన క్రేజ్ తెలుగులో అమాంతం పెరిగిపోయింది. దానితో ఈయనకు వరుసగా తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది.

కొత్త బంగారు లోకం సినిమా తర్వాత అనేక సినిమాలలో నటించిన వరుణ్ కి కొన్ని సినిమాల ద్వారా పర్వాలేదు అనే స్థాయి విజయాలు దక్కిన చాలా వరకు ఈయనకు అపజయాలే దక్కాయి. దానితో ఈయన క్రేజ్ చాలా వరకు తగ్గింది. అలాగే సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. తాజాగా ఈ నటుడు నింద అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని జూన్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

మూవీ ప్రీ ఈవెంట్ కు టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక నిన్న జరిగిన నింద మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వరుణ్ సందేశ్ భార్య అయినటువంటి వితిక కూడా విచ్చేసింది. ఈ ఈవెంట్ లో భాగంగా ఈమె వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో అని కొందరు అనడంపై స్పందించింది. నిందా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వితిక మాట్లాడుతూ ... వరుణ్ ఫెయిల్యూర్ కాదు. ఎందుకు అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు వద్దు అని అన్ని సర్దుకొని వెళ్ళిపోయేవారు ఫెయిల్యూర్ యాక్టర్ అవుతారు. కానీ ఇండస్ట్రీనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు ఆయన అస్సలు ఫెయిల్యూర్ కాదు. ఒక రోజు ఆయన హిట్ కొడతాడు అని తాజాగా వితికా "నింద" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: