బిగ్బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో పాల్గొని విపరీతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో శివాజీ. సినిమాలకు దూరమై చాలా కాలం గడిపిన శివాజీ మల్లి బిగ్బాస్ తోనే రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షో లో శివాజీ 2, మూడు వారాలు ఉంటే ఎక్కువేనని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఫాన్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్ కు చేరుకున్నాడు. థర్డ్ రన్నర్ గా బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

సీజన్ 7 టైటిల్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడంతో శివాజీ కీలకంగా నిలిచాడు. ప్రతి టాస్క్ అండ్ గేమ్స్ లో పల్లవి ప్రశాంతం ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు శివాజీ. ఇక ఈయన టైటిల్ గలవకపోయినా పల్లవి ప్రశాంత్ అభిమానుల మనసులు మాత్రం గెల్చుకున్నాడు.  ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో శివాజీ పాల్గొని ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కంటెస్టెంట్ గా కాదు హోస్ట్ గా. బిగ్ బాస్ బజ్ పేరుతో స్టార్ మా టాక్ షోను టెలికాస్ట్ చేస్తుంది. ఇక ఈ టాక్ షో ప్రతి సీజన్ కు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన మాజీ కంటెస్టెంట్లలో ఎవరో ఒకరిని ఎంచుకుంటారు.

గత సీజన్లో గీత రాయల్ బిగ్ బాస్ బజ్శోకు హోస్ట్ గా వ్యవహ. ఇక బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ ను ఈ టాక్ షోలో హోస్ట్ లు ఇంటర్వ్యూ చేస్తారు. కంటెస్టెంట్స్ ఆట తీరుతో పాటు వారు షో నుంచి బయటకు రావడానికి గల కారణాలు ఈటాక్ షోలో టెలికాస్ట్ చేస్తారు. కాగా ఈ సీజన్లో బిగ్ బాస్ బజ్ స్టాక్ షోకు శివాజీ హోస్ట్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ టాక్ షో కోసం శివాజీ తో బిగ్ బాస్ ప్రతినిధులు సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: