పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్త ఏకంగా 600 కోట్లకు పైగానే బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే ఇందులో ప్రభాస్ సరసన  హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మరియు దిశా

 పటాన్ని హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. వారితోపాటు అమితాబచ్చన్ కమలహాసన్ వంటి లెజెంటరీ స్టార్స్ సైతం ఇందులో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానుండడంతో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ను గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి ట్రైలర్ సైతం విడుదల చేయగా ప్రేక్షకుల నుండి దానికి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి భైరవ యంతం ఆడియో సాంగ్ సైతం విడుదల చేశారు మేకర్ర్స్ .ఈరోజు భైరవ యాంతం వీడియో సాంగ్ విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా నుండి ఇప్పుడు మరొక అప్డేట్ రానంది అని తెలియడంతో ప్రభాస్

 అభిమానులు  తెగ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు అంటూ ఎప్పటినుండో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు. అయితే తాజాగా ఇప్పుడు ఇందులో మరొక ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు అన్న వార్తలు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం ఏవి ఇవ్వకపోయినాప్పటికీ ఇదే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: