ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తండ్రి మీద ఉన్న ప్రేమను చూపించారు. తమ తండ్రి తో ఉన్న అనుబంధాలకి సంబంధించిన పలు గుర్తులను షేర్ చేసుకున్నారు. ఇక అదే సమయంలో తమ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటోలను వీడియోలను మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ సైతం ఫాదర్స్ డే సందర్భంగా తన అభిమానులతో పలు ఆసక్తికరమైన ఫోటోలను పంచుకున్నాడు. తమిళ స్టార్ హీరోయిన్ నయనతార భర్త

 అయిన విఘ్నేశ్ శివన్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా విగ్నేష్  తన ఇద్దరు పిల్లలతో బాహుబలి సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో శివగామి నీటిలో మునుగుతూ బాహుబలిని ఎత్తుకొని తన చేతులతో పైకి చూపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా అదే సీన్ రిపీట్ చేశారో విగ్నేశ్. నీటి అడుగున నిలబడి తన ఇద్దరు పిల్లలు ఉయిర్‌, ఉలగ్‌ను చేత్తో ఎత్తి పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. 'మై డియర్ బాహుబలి 1 & 2.. మీ ఇద్దరి మూలంగానే నాకు ఇది హ్యాపీ ఫాదర్స్ డే. మీ ఇద్దరితో లైఫ్ చాలా

 బావుంది. లవ్ యూ ఉయిర్, ఉలగ్' అంటూ ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో 2022 జూన్‌ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలా పెళ్లి అయిన నాలుగు నెలలకే వీళ్లిద్దరూ సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ కి కూడా ఎంట్ర ఇచ్చింది బ్యూటీ.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: