ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన "పుష్ప" సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రావడమే కాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా లభించింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా"పుష్ప 2 " తెరకెక్కుతుంది.ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగష్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.అయితే ఈ సినిమా వాయిదా పడుతుందనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ యంగ్ డైరెక్టర్ అట్లీ తో ఓ సినిమా చేయనున్నట్లు అందరికి తెలిసిందే.అట్లీ గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా తీసాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీనితో పలువురు స్టార్ హీరోలు అట్లీ తో సినిమా చేసేందుకు సిద్ధంగా అయ్యారు.అయితే అట్లీ అల్లుఅర్జున్ తో మూవీ చేసేందుకు సిద్ధం అయ్యాడు.అయితే తాజాగా అట్లీ ,అల్లుఅర్జున్ కాంబినేషన్ మూవీ ఆగిపోయినట్లు సమాచారం.సన్ పిక్చర్స్ మూవీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.దీనితో అంత భారీ మొత్తం ఇవ్వలేని మేకర్స్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది.దీనితో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేదు.అయితే అల్లు అర్జున్ ప్రస్త్తుతం నటిస్తున్న పుష్ప 2 కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ సినిమాకు మరో పార్ట్ పుష్ప ౩ ని సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: