మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "దేవర"..మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను ముందుగా అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.అయితే తాజాగా ఈ సినిమా ను అనుకున్న తేదికంటే ముందుగానే సెప్టెంబర్ 27 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

రీసెంట్ గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ఫామిలీ తో కలిసి దేవర షూటింగ్ కొరకు థాయ్‌లాండ్వెళ్లారు.ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో పాల్గొంటూనే ఫ్యామిలీతో థాయ్‌లాండ్ వెకేషన్ ను ఎంజాయ్ చేయనున్నారు.తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కనిపించారు.ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర షూటింగ్ ముగిసాక స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్నా మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు .ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాకు "డ్రాగన్ " అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.అలాగే ఈ సినిమాలో విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఫిక్స్ అయినట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: