తమిళ ఇండస్ట్రీలో ప్రేక్షకులు అందరికీ మక్కల్ సెల్వన్ గా కొనసాగుతున్న విలక్షణ అన్నట్టుడు విజయ్ సేతుపతి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అన్న విషయం తెలిసిందే  ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ సేతుపతి తన నటనతో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే అందరిలాగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి.


 అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది స్టార్ హీరోలు కేవలం హీరోలుగా మాత్రమే సినిమాలు చేస్తుంటే.. విజయ్ సేతుపతి మాత్రం హీరోగా మాత్రమే కాదు ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో కూడా నటించారు. ఏకంగా హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రలలో కూడా నటించి తన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇలా ఎలాంటి పాత్ర చేసిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేవారు. మరి ముఖ్యంగా తెలుగులో ఉప్పెన అనే సినిమాలో రాయడం అనే పాత్రలో అదరగొట్టేసాడు అని చెప్పాలి.


 అలాంటి విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి పుష్ప సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయం గురించి ఇటీవల విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు  పుష్ప సినిమాలో ఒక పాత్రను తాను రిజెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ తెలిపాడు. తాను ప్రధాన పాత్రలో నటించిన మహారాజా మూవీ ప్రమోషన్స్ లో జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు. నేను పాత్రని వద్దు అనుకోలేదు  అన్ని సమయాల్లో నిజం చెప్పొద్దు సార్  జీవితానికి బాగుండదు. కొన్నిసార్లు అబద్ధం కూడా చెప్పాలి అంటూ విజయ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: