హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే లోకనాయకుడు కమలహాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతిహాసన్. ఇక తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ.


 అయితే ఇలా సినిమాల్లో నటించి తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టడమే కాదు ఇక డాన్సులు కూడా ఇరగదీస్తూ ఉంటుంది ఈ సొగసరి. అయితే ఇలా హీరోయిన్గా నటించడం మాత్రమే కాదు ఏకంగా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తూ తనలోని సింగింగ్ టాలెంట్ నిరూపించుకునేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఆల్బమ్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో అటు సినిమాలతో కూడా బిజీబిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఇటీవల తన తండ్రి కమల్ హాసన్ బయోపిక్ డైరెక్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.


 ఈ మధ్యకాలంలో బయోపిక్ లా ట్రెండ్ ఇండస్ట్రీలో నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎవరో కాదు ఏకంగా స్టార్ల కుటుంబీకులు బయోపిక్లను డైరెక్ట్ చేయడం లేదంటే నిర్మించడం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి కమలహాసన్ బయోపిక్ కు తెరకెక్కిస్తే మీరు డైరెక్షన్ వహిస్తారా అని అడగగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. ఆయన జీవిత చరిత్రను దర్శకత్వం వహించేందుకు తాను సరైన వ్యక్తిని కాదని.. ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది. తాను దర్శకురాలిగా పనిచేస్తే కేవలం ఒకవైపు పక్షపాతంగా మాత్రమే పనిచేసినట్లు అందరికీ అనిపిస్తుంది అంటూ శృతిహాసన్ సమాధానం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: