తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో సాయి కుమార్ , గోపరాజు రమణ , అయేషా ఖాన్ , హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించగా , యువన్ శంకర్ రాజా. ఈ మూవీ కి సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మూవీ మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ ని ఓ టి టి ప్లాట్ ఫామ్ లో జూన్ 14 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రకటించారు. దీనితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న కలెక్షన్లు కూడా ఈ న్యూస్ తో దెబ్బకు పడిపోయాయి.

ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్ 2 లో కొనసాగుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది. ఇప్పటికీ ఎవరైనా ఈ సినిమాను చూడని వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs