ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని. చంద్రబాబు కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.దీంతో త్వరలోనే ఆయన తన సినీ కెరీర్‌కు గుడ్ బై చెబుతారనే ప్రచారం ఊపందుకుంది. చేతిలో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను విడతల వారీగా కంప్లీట్ చేసి పూర్తి సమయాన్ని రాజకీయాలు, ప్రజాసేవకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో పవన్‌ను తాము అకీరా నందన్‌లో చూసుకుంటామని , వీలైనంత త్వరగా కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా పవర్‌స్టార్‌పై ఒత్తిడి పెంచుతున్నారు అభిమానులు. అకీరాను హీరోగా పరిచయం చేయడానికి ఇదే సరైన సమయమనే వాదనలు వినిపిస్తున్నారు. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోల సినిమాలు రిలీజైన పవన్ సినిమాలు రావడం లేదనే బాధ వారిని వేధిస్తోంది. అందుకే కొడుకుని త్వరగా రెడీ చేయాల్సిందిగా ఈ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

దాదాపు 6.4 హైట్‌తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్‌లా ఉండే అకీరా నందన్‌లో హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. అయితే ఈ కుర్రాడికి మ్యూజిక్‌పై బాగా ఇంట్రెస్ట్ ఉందని సన్నిహితులు చెబుతున్నారు. పియానోను అద్భుతంగా ప్లే చేయగల అకీరా నందన్ .. తన స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటను పియానోపై ప్లే చేసి ఆకట్టుకున్నాడు. కానీ అకీరా కొద్దిరోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్‌కు తోడుగా ఉంటున్న విషయం తెలిసిందె. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఆయన కేరింతలు కొట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అకీరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో వచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తమ్ముడు రీ రిలీజ్‌ నేపథ్యంలో థియేటర్‌కు వచ్చిన అకీరాను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అకీరా నందన్‌పై ఫ్యాన్స్, పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండటంతో ఆయనను హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు.

ఇప్పటికే హీరోకు కావాల్సిన అన్ని రకాల ట్రైనింగ్ సెషన్స్‌ను జూనియర్ పవర్‌స్టార్ వేగంగా పూర్తి చేస్తున్నాడట. అయితే అకీరాను ఫీల్డ్‌లో ఎప్పుడు దింపాలనే నిర్ణయం రేణు దేశాయ్ చేతుల్లో ఉందని ఫిలింనగర్ టాక్. ఆమెకు ఈ విషయంలో ఒక క్లారిటీ ఉందని, ముహూర్తం చూసి అకీరాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు రేణు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రోజు త్వరలోనే రావొచ్చు, ఇంకాస్త టైం పట్టొచ్చు.. కానీ లేట్ అవ్వొచ్చేమో కానీ అకీరా రావడమైతే పక్కా అనే సంకేతాలను మెగా కాంపౌండ్ ఆల్రెడీ ఇచ్చేసినట్లుగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: