గత కొద్ది రోజులుగా బాలయ్య అంజలి పేర్లు సోషల్ మీడియాలో ఎంతలా ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బాలయ్య అంజలి ని తోసేయడం తో ఈ వార్తలకు తెర తీసింది. ఇక ఈ విషయమై బాలయ్య పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ వచ్చింది. అంతేకాదు కొంతమంది అయితే హద్దులు మితిమీరిపోయి మరి ఆయనకు బాడ్ కామెంట్స్ చేశారు. అయినా సరే బాలయ్య ఎప్పుడు సహనం కోల్పోలేదు. కానీ ఇందులో మాత్రం చాలా మంది బాలయ్యకి

 సపోర్ట్ చేశారు అని చెప్పాలి. చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు బాలయ్య అలాంటివాడు కాదు అని ఆయన గురించి మాకు బాగా తెలుసు అని సోషల్ మీడియా వేదికగా బాలయ్యకి మద్దతు ఇచ్చారు. అది సరదాగా చేసిన పని అని బాలయ్య అలాంటి వ్యక్తి కాదు అంటూ ఆయనకి సపోర్ట్ చేశారు. హీరోయిన్ అంజలి సైతం వాళ్ళ మధ్య ఉన్న క్షణము కారణంగానే బాలయ్య అలా చేశాడు అంటూ దాన్ని తప్పుగా అనుకోవద్దు అని అది మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అని మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఇలా చేశారు అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ

 కొందరు మాత్రం ఇదే పనిగా వాళ్ళిద్దరిపై ట్రోల్లింగ్ చేశారు. ఎట్టకేలకు ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బాలయ్య మళ్ళీ మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుండి గెలిచిన తర్వాత అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ అంజలి స్పెషల్ ఐటమ్ సాంగ్ చేయబోతుందట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఇలాంటి కాంబో సెట్ అయి ఉంటే జనాలు పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంత తతంగం జరిగిన తర్వాత వెంటనే బాబీ దర్శకత్వంలో ఐటమ్ సాంగ్ కోసం అంజలిని చూస్ చేసుకోవడం పెద్ద సంచలనంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: