పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.  పిఠాపురం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపు సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తన పదవిని కొనసాగిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఓజీ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ రాజకీయాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాదాపుగా దీనికి సంబంధించిన యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వగా మిగిలిన 50% షూటింగ్

 అలాగే ఉంది. సాహో ఫిలిం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కొన్ని వరకు విడుదల చేశారు. అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన గేమ్స్ సైతం విడుదల చేయగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన తెచ్చుకుంది. ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాము అని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అయితే ఎలక్షన్స్ తర్వాత నుండి దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పవన్ అభిమానులు

 ఎప్పుడెప్పుడు ఆయన సినిమాల నుండి అప్డేట్స్ వస్తాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ అభిమానులు ఎగిరి గంతేసే ఒక వార్త బయటకొచ్చింది. అదేంటంటే.. ఓజీ మిషన్‌లో ఉన్నాడు. పవన్‌ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ మ్యూజికల్‌ అప్‌డేట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు ఎస్‌ థమన్‌. మొత్తానికి ఓజీ ఫస్ట్‌ సింగిల్‌తో స్పీకర్లు బద్దలైపోవడం గ్యారంటీ అని తాజా స్టిల్‌తో చెప్పకనే చెబుతున్నాడు థమన్‌. ఇటీవల ఏపీ ఎన్నికల్లో విక్టరీ విజయం సాధించిన పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా బాధ్యతలు సీక్వరించనున్నారని తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఓజీ షూటింగ్‌కు సంబంధించి ఏదైనా అప్‌డేట్‌ ఇస్తాడేమోనని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో శుభవార్త చెప్పాడు ఎస్‌ థమన్‌..!!

మరింత సమాచారం తెలుసుకోండి: