ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ బ్యూటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వివాహ బంధంలో సెటిల్ అయిపోతూ ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది నటీనటులు వివాహ బంధాల్లోకి అడుగుపెట్టి తమకంటూ సొంత లైఫ్ని ఏర్పరచుకున్నారు. ఇక గతంలో స్టార్డం ఉన్న హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలన్న పిల్లల్ని కనాలన్నా చాలా సంకోచించేవారు. పిల్లల్ని కనడం వల్ల వారి గ్లామర్ దెబ్బతిని ఆఫర్లు ఎక్కడ తగ్గిపోతాయోనని భయపడేవారు. కానీ ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ అలా లేరు. సినీ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ ఏ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు.

పెళ్లి అనంతరం పండంటి బిడ్డకి జన్మనిచ్చి తమ పర్సనల్ లైఫ్ లో దూసుకుపోతున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ కూడా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అమలాపాల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ పెదగా సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాకి దగ్గరలో ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫాన్స్ తో పంచుకుంటుంది. ఇక ఇటీవల అమలాపాల్ ప్రెగ్నెంట్ అయినట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

బ్యూటిఫుల్ అమలాపాల్.. జగత్  దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన మ్యారేజ్ లైఫ్ ను  ఎంజాయ్ చేస్తూ ఈ బ్యూటీ పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అయినట్లు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ అమ్మడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 11న తాను బిడ్డకు జన్మనిచ్చానని చెప్పిన అమల పాలు తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అయితే బాబు ముఖాన్ని చూపించలేదు కానీ పెళ్లాడికి అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఈ మేరకు ఇలై ఆ నీ పేరు పెట్టినట్లు  అమలా పాల్ తెలియజేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ని చూసిన వారంతా కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. ఇక త్వరలోనే అమలాపాల్ తన కొడుకు మొహాన్ని రివిల్ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: