దర్శక ధీరుడు రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో మాక్సిమం అన్ని మూవీస్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల బాహుబలి 1,2 అండ్ త్రిబుల్ ఆర్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు జక్కన్న. దీంతో జక్కన్న సినిమాలో అవకాశం అందుకునేందుకు స్టార్ హీరో అండ్ హీరోయిన్లు కూడా క్యూ కడుతున్నారు.

అటువంటి దర్శకుడు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇస్తే ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసింది అట. ఆమె మరెవ్వరు కాదు టాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష. ఆమె రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసింది అట. అయితే దీనికి ఓ బలమైన కారణం కూడా ఉంది. త్రిష ను హీరోయిన్ గా రాజమౌళి ఆఫర్ చేసిన సినిమా మర్యాద రామన్న. కమెడియన్ గా కొనసాగుతున్న సునీల్ కి జోడిగా హీరోయిన్గా నటించేందుకు మొదట త్రిష నీ సంప్రదించారట రాజమౌళి.

కానీ అప్పటికే స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న త్రిష ఇందుకు ఒప్పుకోలేదట. దీంతో సునీల్ మర్యాద రామన్న మూవీ లో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త అమ్మాయిని తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. నిజానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 12 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఫైనల్ రన్ లో ఏకంగా 40 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ మూవీ లో నటించిన నటీనటుల దిశ పూర్తిగా మారిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో త్రిష అవకాశం వదులుకుని పెద్ద తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. త్రిష కనుక ఈ సినిమాలో నటించి ఉంటే జక్కన్న తదుపరి చిత్రాల్లో కూడా ఆమెకి అవకాశాలు ఇచ్చుండేవాడు . ఆమె మరెవ్వరు కాదు టాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష.

మరింత సమాచారం తెలుసుకోండి: