అల్లు అర్జున్ 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన పుష్ప మూవీతో ఆఖరుగా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన హీరోయిన్గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించాడు. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక పాత్రలో నటించగా... ఈ సినిమాలో సమంత ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది.

ఈ సినిమానే అల్లు అర్జున్, సుకుమార్ కి మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ తోనే వీరిద్దరూ మంచి విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ చిత్రం రెండవ భాగాన్ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. దానితో ఈ సినిమా ఖచ్చితంగా ఆగస్టు 15 వ తేదీన విడుదల అవుతుంది అని అంతా భావించారు.

కానీ అనుహ్యంగా ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పెండింగ్ ఉండడంతో ఆగస్టు 15 వ తేదీ లోపు ఆ పనులు పూర్తి కావు అనే ఉద్దేశంతో ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక పుష్ప పార్ట్ 1 మూవీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 17 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి పుష్ప పార్ట్ 2 ను కూడా ఈ చిత్ర బృందం డిసెంబర్ తేదీనే లాక్ చేసింది. మరి పోయిన సారి వర్కౌట్ అయినట్టు ఈ మూవీ యూనిట్ కి డిసెంబర్ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa