టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు కలిగి ఉండడం, అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమా విడుదల తేదీకి దారి దాపుల్లో చిన్న హీరోలతో పాటు ఏ స్టార్ హీరో సినిమా కూడా లేకుండా చాలా మంది మేకర్స్ జాగ్రత్త పడ్డారు.

కానీ అనూహ్యంగా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూవీ తో కొన్ని సినిమాలు తలపడే అవకాశాలు ఉన్నాయి. అందులో గేమ్ చెంజర్ మూవీ ప్రధమంగా కనబడుతుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తూ ఉండగా, శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.

దాదాపు ఈ నెల, రెండు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఆ తర్వాత రెండు, మూడు నెలలలో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ గేమ్ చెంజర్ పనులు మరో నాలుగు, ఐదు నెలల్లో కనుక కంప్లీట్ అయినట్లు అయితే ఈ సినిమాను కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అలా విడుదల చేసినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప పార్ట్ 2 మరియు గేమ్ చేంజర్ సినిమాలు తలపడే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: