జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పెండింగ్ షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని  ముందుకు కదులుతోంది దేవర టీం.రీసెంట్ గా గోవాలో తారక్-సైఫ్ అలీఖాన్ లపై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్యర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ అనేది జరిగింది. భారీ వర్షాలతో స్పాట్ లో ప్రతికూల వాతావరణ ఉన్నా కానీ టీమ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వర్షం పడుతున్నా? లెక్క చేయకుండా అదే వర్షంలో ఈ షూటింగ్ చేసారు. ఓ రకంగా చెప్పాలంటే వర్షంలో ఈ యాక్షన్ సీన్ మరింత గొప్పగా వచ్చిందని మూవీ యూనిట్ భావిస్తుంది. ఇక తరువాత షెడ్యూల్ థాయ్ లాండ్ లోని కాబ్రీ దీవుల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ తారక్-జాన్వీలపై రొమాంటిక్ సీన్స్ తో పాటు, ఓ పాట కూడా షూట్ చేయనున్నారని సమాచారం.


ఇప్పటికే వీళ్లిద్దరు థాయ్ లాండ్ చేరుకున్నారని సమాచారం తెలుస్తుంది. ఇది కాస్త అభిమానులకు కిక్కిచ్చే సీనే. ఇప్పటి దాకా కూడా సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలే హైలైట్ అయ్యాయి. వచ్చిన వార్త ప్రతీది కూడా దానికి సంబంధించిందే. హీరో, హీరోయిన్ మధ్య ముద్దు ముచ్చటలేదేంటని అభిమానులు నిరుత్సాహ పడుతోన్న సమయంలో ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇందులో భాగంగా అక్కడ తారక్-జాన్వీలపై లిప్ లాక్ లతో కూడిన రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, ఓ పాట కూడా చిత్రీకరించనున్నారని సమాచారం.సాధారణంగా కొరటాల శివ చిత్రాలంటే చాలా డీసెంట్ గా ఎక్కువ రొమాన్స్ లేకుండా చాలా క్లీన్ గా ఉంటాయి. ఆయన సినిమాల్లో రొమాన్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి నార్త్ ని టచ్ చేయాలంటే ఖచ్చితంగా కొరటాల కూడా బోర్డర్ దాటక తప్పదు. కాబట్టి కొరటాల-తారక్ ఆ ఛాన్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: